సమ ప్రాణాయామం
సద్గురుపరబ్రహ్మణే నమః


సాయిరాం !!

1.    శ్వాసకు ఓంకారాన్ని ఎలా అనుసంధానం చేయాలి?
(అది కొంచెం ఒక్కసారి వివరించరా...) అలాగే,
2.    ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే ఏమిటి?
3.    కర్త, భోక్తకి ఉండే సంబంధం ఎలాంటిది? అంటే కర్త లేకపోయినా భోక్త వుంటాడా? కర్త వున్నా భోక్త లేకుండా వుండడానికి సాధ్యం వుందా? ఎలా?

సరే! మామూలుగా ఎవరైనా సరే జపం శ్వాసతో చేసేటప్పుడు మూడు పద్ధతులున్నాయి. అంటే బయటికి మంత్రం వినబడేట్టుగా లేదా ఓంకారం వినబడేట్టుగా అంటూ, అంటే కార, కార, కారం లు, త్రిమాతృకాయుత ప్రణవ ధ్యానం అంటారు దీనినే. అలాగ ముందు కారంతో ప్రారంభించి, తరువాత కారం, తర్వాత కారం, చివరికి లయం అన్నమాట కారంలో.
అంటే ఆ ఆవృత్తి ఎలా పూర్తవ్వాలంటే, ముందు పూరకంతో ప్రారంభిస్తారు కదా! పూరకంతోనే కదా ప్రారంభించేది! గాలి తీసుకుంటూ కారాన్ని అంటూ పైకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత కుంభకం వస్తుంది కదా అక్కడ. కుంభకంలో కారంతో (((ఊఁ...........))) అనే పైకి దీర్ఘం వుంది కదా, ఆ దీర్ఘంలో పూరకం తరువాత వచ్చేది కుంభకం. ఆ తరువాత మళ్ళా క్రిందకి విడిచిపెడుతారు కదా. రేచకం. ఆ రేచకాన్ని చేస్తూ, ‘కారంలోకి వస్తారన్నమాట. కారంలో వున్నటువంటి పల్లు వుంటుంది. (((ఓ........మ్‌మ్‌మ్‌....))) చివర పల్లు వుందిగా. ఆ చివరి పల్లులో రేచకం తరువాత వున్న కుంభకం వుంటుందన్నమాట.
ఇలా బయటకు అంటూ చేయడం వల్ల, క్రమేపీ ఏమౌతుందంటే, శ్వాసలు తగ్గిపోతాయి. నిడివి పెరుగుతుందన్నమాట. తద్వారా Physical Body లో రకరకాల ప్రయోజనాలు వుంటాయి అని ఏదో చెబుతున్నప్పటికీ, దానికంటే ముందు మనో వేగం తగ్గిపోవడం వల్ల, ప్రాణవేగం మనోవేగం స్వాధీనం అవుతాయన్నమాట.

ప్రత్యేకంగా అవి (ప్రాణం-మనస్సు) పరుగెడుతున్నప్పుడు వాటిని ఏమన్నా చేయగలరా?
అవి స్వాధీన పరచుకోలేరు కదా! వేగంగా పరుగెడుతున్న గుర్రాలను స్వాధీనం చేసుకోవడం ఎలాగా అంటారు? నిలబడి వున్న గుర్రాన్ని స్వాధీన పరచుకుని ఎక్కవచ్చు. పరుగెడుతున్న గుర్రాన్ని ఎట్లా ఎక్కుతావు? కాబట్టి, ఇది మెదటి పద్ధతి.

రెండవది నీలో స్థిరపడ్డ తరువాత, పెదవులు మాత్రమే కదుపుతూ చేసేటటు వంటిదన్నమాట. అంటే శబ్దం బయటకు రాదు. ఇలా మానసికంగా చేసేటటువంటి జపానికి అంటే ఇప్పుడు పెదవులు కదుపుతూ చేస్తున్నప్పుడు మానసికంగానే కదా చేసేది. దీనిని అపాంశు జపం అని అంటారు.
మొదటిదేమో ఉచ్ఛారణతో, శబ్ద ఉచ్ఛారణతో కూడుకున్నటువంటి త్రిమాతృకాయుత ప్రణవ ధ్యానం. రెండవది అందులో క్రమేపి స్థిరపడి, శ్వాస వేగం, ప్రాణ వేగం ఒకే స్థాయికి వచ్చిన తరువాత, అప్పుడు అపాంశు జపంసాధ్యం అవుతుంది. ఇక మూడవస్థాయిలో అపాంశు... పెదవులు కదపవలసిన అగత్యం లేదిక. ప్రాణ మనస్సులు ఏకీకృతం అయిపోతాయన్నమాట అపాంశు జపంలో. రెండూ కలసి హృదయ స్థానం యొక్క, తమ పుట్టుక అయినటు వంటి హృదయ స్థానంలోకి చేరుతాయి. అది మూడవ స్థితిలో చేరుతుందన్నమాట. ఈ మూడవ స్థితిలో మనో ప్రాణములు హృదయస్థానములో లయం అయిపోతాయి.
((అంటే అప్పుడు ఇది జరుగదా? జపం జరుగదు))
జరుగుతుంది, కానీ అంతర్లీనంగా జరుగుతుంది. అంటే మనః ప్రాణములతో సంబంధం లేకుండా జరుగుతుంది. ఇవి కదలకుండానే వుంటాయి. కానీ జపం జరుగుతూ వుంటుంది. అర్థమైందా!
            (( అంటే ఇక్కడ శ్వాసకి, జపానికి కూడా సంబంధం విడిపోతుంది))
అన్నీ విడిపోతాయి ఇక. అవి విడిపోవడం వల్ల..

అంతకు ముందు నువ్వు సాధన ఎట్లా చేశావు?
శరీరంతో చేశావు మొదటి స్థితిలో. క్రమేపి శరీరం నేను కాదని మారిపోతావు.
ప్రాణ మనస్సులు నేను రెండవ స్థితి.
మూడవ స్థితికి వచ్చేటప్పటికి ప్రాణ మనస్సలు కాడా చలన రహితంగా వుంటాయి. కానీ జపం జరుగుతూ వుంటుంది.

ఇప్పుడు జపం చేస్తున్నవాడు ఎవడు?
వాడు జీవుడు. అర్థమైందా! ప్రాణమనస్సులు నేను కాదు అన్నవాడెవడో వాడు జీవుడు. ఇప్పుడు వాడికి వున్నాయన్నమాట చిత్తవృత్తులు.

చిత్తవృత్తులు ఇప్పుడు ఎవరికి వున్నాయి?
జీవుడికి వున్నాయి. అర్థమైందా!
కాబట్టి, చిత్తము వృత్తి శూన్యము అవ్వనంతవరకూ ఈ జీవభావం పోతుందా?

(పోదు, వృత్తిశూన్యం అవ్వని వరకూ పోదుకదా!)

కాబట్టి, ప్రతి ఒక్కరూ యోగసాధన ఎందుకు చేస్తున్నారు?
యోగః చిత్త వృత్తి నిరోధకః” – అంతే కదా! చిత్తవృత్తిని నిరోధించడం ద్వారానే, యోగసిద్ధి సాధ్యం అవుతుంది. చిత్తవృత్తిని నిరోధించడం అంటే అర్థం ఇదే, ఈ ఆంతరంగికమైనటు వంటి సాధనా నిష్ఠ కలగడం కోసమని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణలు అనేవి ఏర్పడ్డాయి.
***నిరోధమైన సమాధి పాదంలో కేవలం నేను మాత్రమే వున్నాడు. అంటే ఇప్పుడు జపం ఆగిపోయింది. ఆగిపోయి హృదయద్వారాలు తెరుచుకుని హృదయస్థానంలో వున్న యథార్థమైన నేను ఎవరో, ఆ చిత్త శూన్య స్థితిలో, స్వప్రకాశం ఎలా వుందో, ఆ స్వప్రకాశం తెలిసింది. చిత్త శూన్యంలో ఏర్పడినటువంటి ప్రజ్ఞపేరు నిర్వాణ ప్రజ్ఞ. చిత్తము వృత్తి శూన్యము అవ్వడమే నిర్వాణము అంటే. అట్టి నిర్వాణస్థతిలో ఏర్పడినటువంటి తెలిసినటువంటి తెలివి ఏదైతే వుందో దాని పేరు ప్రజ్ఞ’.
(అంటే ఒక సారి చిత్తశుద్ధి జరిగితే అది ఎప్పటికీ అలాగే వుంటుందా?)
చిత్త శుద్ధి కాదు, చిత్త వృత్తి శూన్యం. చిత్త వృత్తి శూన్యం అవ్వాలి. అవ్వాలి అంటే నీ శరీరం ఏ ప్రారబ్ద వశాత్తు నీకు ఏర్పడిందో తెలియబడాలి. అర్థమైందా! ఇప్పుడు,

 నీ శరీరం ఏ ప్రారబ్దం చేత నీ దగ్గరకు వచ్చిందో, ఏ బలమైన సంస్కారాలను ఆధారం చేసుకుని ఈ శరీరం ఏర్పడిందో తెలుసుకో గలిగావా?
(అది తెలియదు కదా...)
ఆఁ... ఇదంతా 3వ స్థితిలో ప్రయాణం అన్నమాట ఇది. అంటే ప్రాణమనస్సులు నేను కాదని సహజంగా అంతరంగంలో హంస అజప అంటారు చూశావా ఆ అజపా స్థితిలో జపం జరుగుతూ వున్నప్పుడు ఇతడు తన ప్రారబ్దాన్ని తాను తెలుసుకుంటాడు. తాను ఎలా జీవుడుగా వున్నానో తెలుసుకుంటాడు. తనని ఏది శరీరాన్ని ధరింపజేసేట్టు చేసిందో తెలుసుకోగలుగుతాడు. ఏ రకంగా తాను జన్మకు తిరిగి వచ్చాడో తెలుస్తుంది. అలా వాటన్నటిని, అప్పుడు సంస్కారాలు రద్దు అయ్యే పద్ధతిలో జీవించగలుగుతాడు. అప్పటి వరకూ సంస్కారాల అనుభవం కోసం జీవిస్తూ వుంటాడు జీవుడిగా. ఇప్పుడు ఇక్కడి నుంచి జీవుడి నుంచి ఆత్మ భావనలో స్థిరపడే దశగా నువ్వు ప్రయాణం చేసతావన్నమాట. అంటే స్థిత ప్రజ్ఞత్వం ఈ మూడవ స్థితిలో వస్తుందన్నమాట. ఎప్పుడైతే నీకు చిత్త వృత్తి శూన్యస్థితిలో నిర్వాణ ప్రజ్ఞ తెలుస్తుందంటే, స్వప్రకాశమైన స్థితి నీకు అనుభవానికి వచ్చి, ఆ ప్రకాశమే నేను అని స్థిరంగా వుంటాడు ఇక.
            ప్రకాశమే నేను అని స్థిరంగా వుండడమే ఆత్మ సాక్షాత్కారజ్ఞానం అంటే. ఇక అప్పుడు ఈ ప్రకాశానికి తప్ప దేనికీ ప్రాధాన్యత ఇవ్వడు. పుట్టింది మొదలు పోయేలోపు వున్నటువంటి, సమస్త సంఘటనల అన్నింటి మీద కూడా, దేనికీ ప్రాధాన్యత లేదు, దేనికీ చలించడు. కేవలం ప్రకాశమే నేనుగా వుంటాడు.

((మీ రెండవ ప్రశ్నకు సమాధానం ఇది ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే))
  
ఇహ మూడవది.
నేను అనేవాడు, నేను చేస్తున్నాను అంటున్నవాడు జీవుడే. నేను అనుభవిస్తున్నాను అంటున్నవాడు కూడా జీవుడే. అర్థమైందా! అంటే జీవుడికి రెండు ముఖాలున్నాయి. ఒకటి కర్త రెండు భోక్త.

చిత్త వృత్తికి లోబడి, భోక్తగా వుంటే ఏమయ్యావ్‌?
విషయావృతమై వున్నావు. విషయావృతమై వుంటావు. అదే,

చిత్తవృత్తులను అధిగమించి, చిత్తవృత్తిశూన్యస్థితిలో వుండి, ఆత్మభావాన్ని ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందినప్పుడు, ఇదే జీవుడు ఏమయ్యాడప్పడు?
ఆత్మగా, సాక్షిగా మిగిలిపోయాడు.

అప్పుడతనికి ఏం లేదు?
వ్యవహారం లేదు. అవ్యవహారిగా వున్నాడు. విషయాలలో అవ్యవహారి. పంచకోశాలలో అవ్యవహారి. అర్థమైందా! ఇలాగా ఎప్పుడైతే అకర్త. అవ్యవహారి అయ్యేప్పటికి ఏమైంది, ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? అంటే నేను చేయట్లేదు అన్నాడు. వ్యవహారం వున్నంత వరకూ కర్త వుండక తప్పటం లేదు. కర్తవున్నంతవరకూ ఎలా అయినా కానీ భోక్తృత్వానుభవం తప్పదు. అర్థమైందా!

అంటే, భోక్త అంటే భోగ్యం మీద దృష్టి వున్నటువంటి వాడు. కర్తఅంటే ప్రేరణకు లొంగే వాడు, చిత్త వృత్తి ప్రేరణకు లొంగుతున్నవాడు ఎవడో వాడు కర్త. వాడు జీవుడు. అర్థమైందా!

ఒకే జీవుడికి రెండు ప్రతిబింబాలు వున్నాయి. వృత్తి వ్యవహారంలోకి వచ్చినప్పుడు కర్త అయివున్నాడు. వ్యవహార అనుభవంలోకి వచ్చేప్పటికి భోక్త అయ్యాడు. కలిసే స్థాయికి వచ్చేసేటప్పటికి భోక్త వచ్చేసింది. అంటే ఎలా అంటే, ముందు భోక్త అనేవాడు ఫలితాసక్తి విడిచిపెట్టి, నువ్వు నిష్కామకర్మను కనుక ఆచరించ గలిగితే,
ఆ నిష్కామ కర్మ వల్ల నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మలో స్థిరంగా వుంటావో, అప్పుడు ఈ భోక్త కనపడడిక. ఎందుకంటే ఫలితాసక్తి లేదు కాబట్టి. అర్థమైందా?

((( ఇప్పుడు నిష్కామ కర్మ చేసేటప్పుడు, కర్త కూడా వుండడు కదా! )))
మనసు వున్నంత కాలం కర్త వుంటాడు. జీవుడు వున్నంత కాలం, జీవుడే కర్త. జనన మరణాలు లేవని నీకు ముక్త స్థితిలో నిర్ణయమైనప్పుడే కర్త లేకుండా పోతాడు. అర్థమైందా!
పుడుతున్నది ఎవరు?, పోతున్నది ఎవరు? ఆ రెండు నిర్ణయమై, ఆ రెండూ లేకుండా పోయే ముక్త స్థితి వచ్చే వరకు కూడా కర్తస్థితి తప్పదు. ఆ ముక్త స్థితిని అనుభవించేటప్పుడే, నీవు కర్త రహితమైన పద్ధతిని ఎట్లాగో అనుభవజ్ఞానంలో తెలుస్తుంది. అంటే కర్తృత్వ రహిత పద్ధతిని బోధించడానికి వీలుకాదు. అర్థమైందా! కాబట్టి, ముందు నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అమనస్కం. ఈ రెండూ వుంటాయన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇలా గ్రహించగలిగినప్పుడే నీవు దానిని దాటగలవు.

అయితే ఇదంతా ఆంతరిక సాధనకు సంబంధించింది. ఈ ఆంతరిక సాధన అంతాకూడా నువ్వు గురువు ఆశ్రయంతో నడపాలన్నమాట. అంటే ఎప్పటికప్పుడు నువ్వేంచెయ్యాలి అంటే, ప్రాణం మనస్సు రెండూ ఒకే స్థాయిలో వుండి, రెండూ కలిపిపోయిన స్థితి నుంచి, గురుమూర్తి ధ్యానం చాలా అవసరం. గురుమూర్తి ధ్యానం ఎప్పుడైతే ఆ మూర్తి మీద దృష్టి పెట్టినప్పుడు, నీకు అది మూడవ స్థితిలో వుపయోగపడుతుంది. చిత్తవృత్తి శూన్యస్థితి ఏర్పడినప్పుడు ఈ ప్రకృతి ప్రభావం చేత, సమిష్టియైనటువంటి, శక్తి రూపమైనటువంటి, సూక్ష్మశరీరం ప్రభావం చేత ఏర్పడినటువంటి సమస్యలు అన్నీ కూడాను, ఆ చిత్తవృత్తి శూన్యం ఏర్పడేటప్పుడే వస్తాయి. అవన్నీ తప్పుకోవాలంటే ఈ గురుమూర్తిని ఆశ్రయించడం చాలా అవసరం. సూక్ష్మశరీరాన్ని అధిగమించాలి అంటే, గురుమూర్తిని ఆశ్రయించకుండా వీలుకాదు అన్నమాట! అందుకని గురువు లేకపోతే, గురు వినా ముక్తి లేదుఅని చెప్పటానికి కారణం అది. సాయిరాం !!


       



ఓం తత్‌ సత్‌
https://sadhakudu.blogspot.in